Answer:
రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.