Subject:
India LanguagesAuthor:
ignacioCreated:
1 year agoఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం. దృశ్యపరమైన భాషలో కొలవదగిన ఒక ఉపరితలం పై కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ, భావాలను ఆలోచనలను వ్యక్తపరచటమే చిత్రలేఖనం. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు, స్పాంజ్, రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ లని కూడా వాడతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారని, వాటినికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.
దృశ్యకళలో చిత్రలేఖనానికి తగు ప్రాముఖ్యత ఉన్నది. చిత్రపటాన్ని గీయటం, కూర్పులే కాకుండా, సంజ్ఞ, కథనం మరియు నైరూప్యం చిత్రలేఖనంలో కీలక పాత్రలు పోషిస్తాయి. సహజత్వం, ప్రాతినిధ్యం, చాయాచితం, నైరూప్యం, కథనం, ప్రతీకాత్మకం, భావోద్రిక్తం లేదా రాజకీయం : చిత్రలేఖనంలో ప్రధాన వర్గాలు.
చిత్రలేఖనం ఊహకి రుపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబంబించే చిత్రలేఖనం ఒక వైపు అయితే కల్పితలోకాలలో విహరించేది మరొకవైపు, భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలి చిత్రలేఖనం, మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ. చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడి పంచాయని చెప్పవచ్చును. పాశ్చాత్య దేశాలలో ప్రార్థనాలయాల పైకప్పులు క్రీస్తు జీవిత చరిత్రలోని ఘట్టాలతోను, తూర్పు దేశాలలో అనేక చిత్రలేఖనాలు బుద్దుని చిత్రపటాలతోను చిత్రీకరించారు.
నా యొక్క అభిప్రాయం : చిత్రకారుడు ఎంతో గొప్పవాడు. ఎందుకంటే చక్కటి చిత్రాలను గీస్తాడు. చిత్రకారుడు ఎలాంటి చిత్రాలైనా అందంగా, సులవంగా చిత్రీకరిస్తాడు.
# Telugu ❣️
Author:
jellynv7n
Rate an answer:
8